గిరిజన ప్రజాప్రతినిధులతో కేటీఆర్‌ భేటీ

  • పార్టీ బలోపేతం, గిరిజన సమస్యలపై చర్చ
  • కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తాటి వెంకటేశ్వర్లు

దమ్మపేట, ఆంధ్రప్రభ: తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులు, భవిష్యత్‌ కార్యాచరణపై వారితో చర్చించారు.

రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు, ప్రజల అవసరాలు, పార్టీని మరింత బలోపేతం చేసే అంశాలపై ప్రజాప్రతినిధుల నుంచి కేటీఆర్‌ వివరాలు తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయడంపై కూడా చర్చ జరిగినట్లు తెలిపారు.ఈ సందర్భంగా బూర్గంపహాడ్‌, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర మాజీ ట్రైకార్‌ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు తాటి వెంకటేశ్వర్లు కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

అశ్వారావుపేట నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులు, గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై కేటీఆర్‌తో తాటి వెంకటేశ్వర్లు చర్చించారు.