కేఆర్ఎంబీ మూలాధారం జలాశయం..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీశైలం జలాశయం ఠాగూర్ సాగునీరు విద్యుత్ ప్రాజెక్టులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ ప్రాజెక్టును సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు నూతన చైర్మన్ డీ.పీ. పాండే పేర్కొన్నారు. బుధవారం నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం రిజర్వాయర్ ను కే ఆర్ ఎం బీ చైర్మన్ పాండే, చీఫ్ ఇంజనీర్ కబీర్ భాష, ఈ ఈ వేణుగోపాల్ రెడ్డిలతో కలసి పరిశీలించారు.

డ్యామ్ గేట్ల దిగువనున్న ప్లంజ్ ఫుల్ (Plunge full)ను దెబ్బతిన్న వైనాన్ని గురించి అడిగి తెలుసుకున్నారు. 2009లో వచ్చిన భారీ వర్షాలకు వరదలతో డ్యాం వివో భాగాన ఉన్నా ప్లంజ్ ఫూల్ వంద అడుగులలోతు గొయ్యి ఏర్పడిందని అధికారులు చైర్మన్ కు వివరించారు. గొయ్యిలో ఏర్పడిన దానికి మరమ్మతులుగా సిలిండర్లను ఏర్పాటు చేశారని తెలిపారు. శ్రీశైలం కృష్ణానది(Srisailam Krishna River) నీటి వనరులతో కూడుకున్నవ్యవస్థ అని తెలిపారు.

శ్రీశైలం జలాశయం వద్ద ఆయా ప్రాంతాల్లో తిరిగి పరిశీలించారు. శ్రీశైలం జలాశయంకు పోతిరెడ్డిపాడు(Pothireddypadu) బనకచర్ల నాగార్జునసాగర్లు అనుసంధానంగా ఉన్నాయని తెలిపారు. శ్రీశైలం జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన విద్యుత్ కేంద్రాలను పరిశీలించారు. నీటి వినియోగంను ఎలా ఉపయోగిస్తున్నారు అంటూ ఆరా తీశారు. శ్రీశైలం డ్యామ్ నమూనాను బ్లూ ప్రింట్ చార్ట్ ను తెప్పించారు. వాటిలో ఉన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ గా కొత్తగా బాధ్యతలు చేపట్టానని ఒకసారి సిస్టం యొక్క అవగాహనను చూద్దామని వచ్చానని తెలిపారు. శ్రీశైలం డ్యాం మరింత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి(Bhramarambika Mallikarjuna Swamy) దేవస్థానం కు దేశవ్యాప్తంగా జ్యోతిర్లింగాలలో ఒకటేనా శ్రీశైలం ఇప్పటికే చాలా అభివృద్ధి చెందిందని భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.

శ్రీశైలం జలాశయం వస్తున్నవరద నీరును క్యూసెక్కులను పరిశీలించారు. ఎన్ని గేట్ల ద్వారా ఎన్నిసార్లు డ్యాములో నీరును సాగర్కు వదిలారని వాటి వివరాలను లెక్కలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పలువురు జలాశయం ఇంజనీర్లు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply