70. మాధవుండునన్న శ్రీధరుండన్నను
దీవెనలను ఇచ్చు దేవుడవయ
పేరు ఏదియయిన పరమార్థమే నీవు
గీతదాత నీకు కేలుమోడ్తు
71. మెరుపులోన మూతివిరుపులోనను నీవె
రసములన్ని నీదు రసనపైనె
గుణములన్ని నీలొ కొలువైన దేవుడా!
గీతదాత నీకు కేలుమోడ్తు
72. అందమునకు నెలవు బృందావనమ్మది
ఆటపాటలకును ఆట పట్టు
పరిమళమ్మునకును పర్యాయపదమది
గీతదాత నీరు కేలుమోడ్తు