58. కిటుకులెన్నొ తెలుసు కిరికిరి తెలియును
బాల్యమందె ఇట్టి ప్రజ్ఞ చూపి
దొంగవేషములును దోబూచులాటలు
గీతదాత నీకు కేలుమోడ్త్తు
59. మండులెండలయిన పండువెన్నెలజేయు
పగలు రాత్రియగును వగలు పెరిగి
కాలమంత నీకు కరవాలమేయగు
గీతదాత నీకు కేలుమోడ్తు
60. వంటచేయగలవు వడ్డించగలవయ్య
ఆవురావురనెడు అమరులకును
పాకశాసనునకు పాకమ్మునిచ్చిన
గీతదాత నీకు కేలుమోడ్త్తు