కొరియా చిత్తు.. జపాన్‌తో భారత్ ఫైనల్ ఫైట్ !!
మొహాలి, ఆంధ్రప్రభ :
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ–2026లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ జోరు కొనసాగుతోంది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో దక్షిణ కొరియాపై 8–1తో ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ విజయంతో టోర్నీలో వరుసగా ఆరో గెలుపును నమోదు చేసిన టీమిండియా.. గురువారం జరిగే తుది పోరులో జపాన్‌తో తలపడనుంది. రికార్డు స్థాయిలో ఆరోసారి టైటిల్‌ను కైవసం చేసుకోవడంపై భారత్ దృష్టి సారించింది.
ఒలింపియన్ బల్బీర్ సింగ్ సీనియర్ అంతర్జాతీయ హాకీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. షిలానంద్ లక్రా (4, 13వ నిమిషాలు), దిల్‌ప్రీత్ సింగ్ (21, 25వ నిమిషాలు) చెరో రెండు గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (9వ నిమిషం), సుఖ్‌జీత్ సింగ్ (21వ నిమిషం), అంగద్ సింగ్ (36వ నిమిషం), వివేక్ ప్రసాద్ (54వ నిమిషం) ఒక్కో గోల్ చేశారు.
కొరియా తరఫున హాన్ సంగ్‌జున్ 9వ నిమిషంలో గోల్ సాధించాడు. అయితే భారత జట్టు దూకుడు ముందు కొరియా నిలవలేకపోయింది. క్రెయిగ్ ఫుల్టన్ మార్గదర్శకత్వంలో టీమిండియా సమన్వయంతో ఆడి భారీ విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో టైటిల్ పోరుకు సిద్ధమైంది.
