వైసీపీ నుంచి జనసేనలో చేరిన కొండయ్య

కోడూరు, ఆంధ్రప్రభ: సాలెంపాలెం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు కొప్పనాతి కొండయ్య జనసేన పార్టీలో చేరారు. గురువారం కోడూరు మండల జనసేన పార్టీ కార్యాలయంలో సాలెంపాలెం ఎంపీటీసీ లంకే భాస్కరరావు ఆధ్వర్యంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా కోడూరు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు మర్రే గంగయ్య.. కొప్పనాతి కొండయ్యకు పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. కొండయ్య పార్టీలో చేరడంతో సాలెంపాలెం గ్రామపంచాయతీలో జనసేన పార్టీ మరింత బలోపేతం అవుతుందని గంగయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కొండయ్య వార్డు మెంబర్‌గా గెలుపొందినట్లు తెలిపారు.

జనసేనలో చేరిన కొండయ్య మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి జనసేన పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కొండవీటి సునీత, కోడూరు పట్టణ అధ్యక్షుడు కోట రాంబాబు, కోడూరు పీఏసీఎస్ అధ్యక్షుడు పూతబోయిన కరుణ్ కుమార్, పూతబోయిన సీతారత్న సాయిబాబు, బచ్చు వెంకటేష్, వర్రే రాంబాబు, అప్పికట్ల వినోద్, కాగిత రామారావు, తండు గంగాధర్ రావు, కొల్లబత్తిన సుశాంత్, రాములు, కొప్పనాతి ఏడుకొండలు, సింగోత్తు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.