Komarum Bheem | ఆదివాసీల‌కు దుప్ప‌ట్ల పంపిణీ

Komarum Bheem | ఆదివాసీల‌కు దుప్ప‌ట్ల పంపిణీ

  • పోలీసుల ఆధ్వర్యంలో అంద‌జేత‌
  • గిరిజ‌న మహిళలతో సినీనటి నిహారిక నృత్యాలు

Komarum Bheem | సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని మారుమూల ఆదివాసి గ్రామమైన శెట్టి హడుపు నూర్ గ్రామపంచాయతీలో శనివారం రాత్రి పోలీసులు మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సినీ, టీవీ ఛానల్ నటి నిహారిక తోపాటు ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్, పోలీసులు పాల్గొన్నారు. పోలీసుల ఆధ్వర్యంలో ఏఎస్పీ చిత్తరంజన్, సినీనటి నిహారిక 150 మందికి పైగా నిరుపేద ఆదివాసీలకు దుప్పట్లు పంపిణీ చేశారు.

Komaram Bheem

ఈ కార్యక్రమంలో ఆదివాసి మహిళలతో సినీనటి నిహారిక ఆదివాసి సంప్రదాయం నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ చిత్తరంజన్ మాట్లాడుతూ ప్రజలకు శాంతి భద్రతతోపాటు పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రాత్రి వేళల్లో పోలీసులు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం హర్షణీయమని కొందరు గిరిజనులు నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో జైనూర్ సీఐ రమేష్, సిర్పూర్ (యు), లింగాపూర్, కేరమేరి మండలాల ఎస్సైలు రామకృష్ణ, గంగన్న, మధుకర్, పోలీసులు, నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply