కోడూరులో ఉప్పొంగిన అభిమానం

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా భారీగా తరలిన నాయకులు, కార్యకర్తలు

కోడూరు, ఆంధ్రప్రభ : జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా కోడూరులో జనసైనికుల అభిమానం ఉప్పొంగింది. మండలంలోని వివిధ గ్రామాల నుంచి జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు అత్యంత ముఖ్యమైన రోజుగా భావించే పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు వేడుకలను కోడూరు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

అవనిగడ్డలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు కోడూరు మండల జనసేన పార్టీ కార్యాలయం వద్ద నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా బయలుదేరారు. మండల జనసేన పార్టీ అధ్యక్షుడు మరే గంగయ్య, జిల్లా జనసేన నాయకురాలు కొండవీటి సునీత, కోడూరు పట్టణ అధ్యక్షుడు కోట రాంబాబు, జరుగు పోతురాజు, బచ్చు వెంకటేష్‌ తదితరులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

పార్టీ కార్యాలయం నుంచి గంగానమ్మతల్లి గుడి సెంటర్‌ వరకు బాణాసంచా కాలుస్తూ పవన్‌ కల్యాణ్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది. అనంతరం కోడూరు ప్రధాన సెంటర్‌లోని ఆంజనేయస్వామి ఆలయంలో జనసేన పార్టీ నాయకులు పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా కోడూరు మండలంలోని అన్ని గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో ప్రధాన సెంటర్‌ సందడిగా మారింది. అభిమానుల నినాదాలతో కోడూరు ప్రధాన సెంటర్‌ హోరెత్తింది.

ఈ కార్యక్రమంలో పీసీ చైర్మన్‌ దేవనబోయిన వెంకటేశ్వరరావు, కోడూరు లింగారెడ్డిపాలెం బ్యాంకు అధ్యక్షుడు పూతబోయన కరుణ్‌కుమార్‌, కోట సుబ్బారావు, నీటి సంఘాల అధ్యక్షులు బడే బావన్నారాయణ, చుండూరు శివనాగేశ్వరరావు, ఇజ్జినేని శివాజీ, పూతబోయన సీతారత్న సాయిబాబు, కాగిత రామారావు, అప్పికట్ల వినోద్‌, వర్రే రాంబాబు, యర్రంశెట్టి శ్రీదుర్గ, లంకే భాస్కరరావు, యర్రంశెట్టి దామోదర్‌రావు, బాసు శివప్రసాద్‌, సిద్దినేని అశోక్‌నాయుడు, సనక జగన్‌, కడవకొల్లు రంగా, బావిశెట్టి కోటేశ్వరరావు, జరుగు ఆదినారాయణ, మంగళగిరి శ్రీనివాసరావు, దేవనబోయిన కేశవనారాయణ, జరుగు లక్ష్మణ్‌ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.