New Zealand vs India | 185 పరుగులకే కివీస్ ఆలౌట్..
New Zealand vs India | 185 పరుగులకే కివీస్ ఆలౌట్..
భారత్ లక్ష్యం 186 పరుగులు!
New Zealand vs India | ఆక్లాండ్, ఆంధ్రప్రభ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు సత్తా చాటారు. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 40.2 ఓవర్లలో 185 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ ముందు 186 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.
కివీస్ బ్యాటర్లలో టిమ్ సీఫెర్ట్ 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బ్లెయిర్ టిక్నర్ 34, గ్లెన్ ఫిలిప్స్ 30, డారిల్ మిచెల్ 28, జాకబ్ డఫ్ఫీ 15 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు.
భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ నాలుగు వికెట్లు పడగొట్టి కివీస్ పతనాన్ని శాసించాడు. గుర్నూర్ సింగ్ మూడు వికెట్లు తీయగా.. అన్షుల్ రెండు వికెట్లు సాధించాడు. భారత బౌలర్ల సమష్టి ప్రదర్శనతో న్యూజిలాండ్ 200 పరుగుల మార్కును కూడా చేరుకోలేకపోయింది.
