ఖైరతాబాద్ బడా గణేశుడిని దర్శించుకున్న కిషన్‌రెడ్డి
- వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్ర మంత్రి
ఆంధ్రప్రభ, హైదరాబాద్ : వినాయక చవితి పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ బడా గణేశుడిని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. సతీసమేతంగా వచ్చిన ఆయన గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా గణేశుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన మంత్రి.. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో నిర్వాహకులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా చర్యలు చేపట్టారు.
