Kiara Advani | అందాల్లో.. అందాలు.. బీచ్‌లో కియారా సోయగాలు.. ఫొటోలు వైరల్‌

ఆంధ్ర‌ప్ర‌భ : బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కియారా అద్వానీ తన భర్త, నటుడు సిద్ధార్థ్‌ మల్హోత్రా, కుమార్తె సారాయాతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. బీచ్‌ అందాలు, ప్రకృతి ఒడిలో విశ్రాంతి క్షణాలు, కుటుంబంతో గడిపిన మధుర సమయాలు ఆ ఫొటోల్లో కనిపించాయి. ముఖ్యంగా కుమార్తె ముఖాన్ని చూపించకుండా ఆమె చిన్న పాదాలను మాత్రమే ఫొటోల్లో పంచుకోవడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. స్టార్‌డమ్‌ ఎంత ఉన్నా కుటుంబానికి సంబంధించిన ప్రైవసీకి ప్రాధాన్యమిచ్చే ఈ జంట.. తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూనే వ్యక్తిగత జీవితాన్ని ప్రత్యేకంగా ఉంచుకుంటోంది. ఈ క్రమంలోనే కియారా తన అభిమానులతో మరో శుభవార్తను పంచుకుంది.