రైతు కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం అందజేత
పీఏసీఎస్ సభ్యుడి మృతితో కుటుంబానికి బీమా పరిహారం
ఖానాపూర్ టౌన్, ఆంధ్రప్రభ : సుర్జాపూర్ గ్రామానికి చెందిన రైతు షేక్ హుస్సేన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్), ఖానాపూర్‌లో సభ్యుడిగా ఉండటంతో సంఘం నిబంధనల ప్రకారం కుటుంబానికి బీమా పరిహారం మంజూరైంది.
ఈ మేరకు శనివారం పీఏసీఎస్ ఖానాపూర్ ఆధ్వర్యంలో మృతుడి కుమారుడు షేక్ షాకీర్‌కు రూ.2 లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ కరిపె శ్రీనివాస్, సీఈవో శ్రీనివాస్‌రెడ్డి, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
