ఖమ్మం కార్పొరేషన్‌లో డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఖరారు
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ఆమోదం..
ప్రకటించిన అర్బన్ డీసీసీ అధ్యక్షుడు దీపక్‌చౌదరి
ఖమ్మం ఉమ్మడి బ్యూరో, ఆంధ్రప్రభ : ఖమ్మం కార్పొరేషన్‌లోని 60 డివిజన్లకు కాంగ్రెస్ అధ్యక్షులు, డివిజన్‌కు 20 మంది చొప్పున కార్యవర్గాలను ఖరారు చేశారు. ఖమ్మం అర్బన్ డీసీసీ అధ్యక్షుడు నాగండ్ల దీపక్‌చౌదరి గురువారం హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాలను ఆవిష్కరించి విడుదల చేశారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 57 డివిజన్లతో పాటు పాలేరు నియోజకవర్గ పరిధిలోని మూడు డివిజన్లకు అధ్యక్షులు, కార్యవర్గాలను నియమించారు.
ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు, కమిటీ సభ్యులకు మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు తుమ్మల యుగంధర్, అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్‌చౌదరి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని డివిజన్ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో నిరంతరం పనిచేయాలని ఆకాంక్షించారు.
