Tadipatri | నాకు ప్రాణహాని ఉంది..

Tadipatri | నాకు ప్రాణహాని ఉంది..


Tadipatri | తాడిపత్రి, ఆంధ్రప్రభ : తాడిపత్రి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. కొంతమంది తనను హత్య చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌లకు తెలిసే జరుగుతోందా? అని ప్రశ్నించారు.

అనంతపురం ఎస్పీ జగదీష్‌ను ఉద్దేశించి కూడా పెద్దారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన ఇంటి పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. తన గన్‌మెన్‌ను ట్రాప్‌ చేసి తన కదలికలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారని పేర్కొన్నారు. పోలీసుల తీరుపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తన భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసుల వైఖరిని ప్రశ్నించారు.