ఘనంగా కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు

గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సాధకులు,తెలంగాణ తొలి ముఖ్యమంత్రి,జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 72 వ జన్మదిన వేడుకలు మండల కేంద్రంలోని స్థానిక చౌరస్తాలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు బండారు చంద్రయ్య ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు.కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో తేరటుపల్లి మాజీ ఎంపీటీసీ గొరిగె సత్తయ్య,అంతంపేట గ్రామశాఖ అధ్యక్షులు అయితరాజు హనుమంతు,పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు పున్న కిశోర్,చిలుకూరి అంజయ్య,పున్న ఆనంద్,జూలూరి పురుషోత్తం,కర్నాటి వెంకటేశం,బావండ్ల శ్రీనివాస్,నారని జగన్, బిపిఎల్,కర్నాటి అబ్బయ్య, నేలంటి వెంకటేశం,పిశికె రాంబాబు,గుర్రం యాదయ్య, పెదగాని శ్రీను,వావిళ్ళ వెంకటేశం, కుకుడాల వినోద్,దుబ్బాక మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
