ఎర్రవెల్లిలో కేసీఆర్ ప్రత్యేక పూజలు…
- ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బీఆర్‌ఎస్ అధినేత, శోభమ్మ దంపతులు, హిమాన్షు రావు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : వినాయక చవితి సందర్భంగా బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్ దంపతులు శోభమ్మతో కలిసి గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ మనుమడు కల్వకుంట్ల హిమాన్షు రావు కూడా పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి భక్తిశ్రద్ధలతో గణేశుడిని ఆరాధించారు. వినాయక చవితి సందర్భంగా ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

