గోదావరి నది వద్ద కార్తీక దీపోత్సవం..

బాసర, ఆంధ్రప్రభ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి కొలువైన గోదావరి నది తీరం వద్ద కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని ఆలయం తరఫున గోదారమ్మకు వేద మంత్రోచ్చారణలతో వేదపండితులు, అర్చకులు నిత్య హారతి నిర్వహించారు. అనంతరం వారు కార్తీక విశిష్టతను వివరించారు.
తరువాత, భక్తులు ప్రత్యేక కార్తీక దీపోత్సవం జరుపుకున్నారు. ఈ పూజ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఆలయం తరపున ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ ఈవో అంజనీదేవి, అర్చకులు, వేదపండితులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
