karthi | తెలుగులో చేస్తున్న సినిమాలు ఇవే..

karthi | తెలుగులో చేస్తున్న సినిమాలు ఇవే..
karthi | ఊపిరి తర్వాత స్ట్రైట్ తెలుగు సినిమాలు
హిట్ 4లో కీలక పాత్రలో కార్తి
వెంకటేష్ – అనిల్ రావిపూడి సినిమాలో కార్తి?
సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో మరో సినిమా
రెండేళ్ల పాటు టాలీవుడ్‌లోనే బిజీ స్టార్
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కోలీవుడ్ స్టార్ కార్తి.. తెలుగులో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. తను నటించిన సినిమాలను తమిళ్ లో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో మాట్లాడుతూ.. ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. కార్తి తెలుగు హీరోనే అనే ఫీలింగ్ కలిగించాడు. టాలీవుడ్ కింగ్ నాగార్జునతో ఊపిరి సినిమాలో నటించి తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యాడు. ఇప్పుడు తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్నాడని తెలిసింది. ఇంతకీ.. కార్తి చేస్తున్న తెలుగు సినిమాలు ఏంటి…?

ఊపిరి సినిమా తర్వాత కార్తి తెలుగులో మరో స్ట్రైయిట్ మూవీ చేయాలి అనుకున్నారు కానీ.. ఇంత వరకు సెట్ కాలేదు. ఇప్పుడు అంతా సెట్ అయ్యింది. వరుసగా తెలుగులోనే సినిమాలు చేస్తుండడం విశేషం. రెండు సంవత్సరాలు పాటు కార్తి తెలుగు సినిమాలతోనే గడపబోతున్నాడని తెలిసింది. కార్తి హిట్ 4 లో నటించనున్నాడు. ఇది ఎప్పుడో కన్ ఫర్మ్ అయ్యింది. దీనికి శైలేష్ కొలను డైరెక్టర్. నేచురల్ స్టార్ నాని దీనికి నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కనుంది అనేది త్వరలో అనౌన్స్ చేయనున్నారు.

విక్టరీ వెంకటేష్, హిట్ మిషన్ అనిల్ రావిపూడి.. ఈ ఇద్దరి కాంబోలో రూపొందే సినిమా త్వరలోనే అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లానింగ్ జరుగుతుంది. అయితే.. ఈ సినిమాలో ఓ పాత్ర కోసం కార్తిని తీసుకుంటున్నారని తెలిసింది. దీంతో పాటు సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ కార్తి హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తుంది. దీనికి మ్యాడ్, మ్యాడ్ 2 చిత్రాలు తీసిన కళ్యాణ్ శంకర్ డైరెక్టర్. స్టోరీ దాదాపుగా లాక్ అయ్యింది. ఈ మూవీని వీలైనంత త్వరగా పట్టాలెక్కించనున్నారని సమాచారం. ఈ లెక్కన బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలతో కార్తి తెలుగులో బిజీ కానున్నాడు. అంటే.. దాదాపు రెండు సంవత్సరాల పాటు తెలుగు సినిమాలతోనే ఉండబోతున్నాడు. మరి.. ఈ సినిమాలతో ఏ రేంజ్ లో మెప్పిస్తాడో.. ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.

