హైదరాబాద్ అభివృద్ధిపై కర్ణాటక మేయర్ ప్రశంసలు

హైదరాబాద్, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరం విశేష అభివృద్ధి సాధించిందని కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి మేయర్ గాదెప్ప ప్రశంసించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ వచ్చిన ఆయన సోమవారం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మేయర్ గాదెప్పకు ఎమ్మెల్యే తలసాని ఘన స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం గాదెప్ప కూడా ఎమ్మెల్యేను శాలువా, పూలమాలతో సత్కరించారు.

గాదెప్ప మాట్లాడుతూ, పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ అన్ని రంగాల్లో విశేష పురోగతి సాధించిందన్నారు. సింగపూర్, మలేషియా వంటి అంతర్జాతీయ నగరాలకు సమానంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దారని పేర్కొన్నారు. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని చేపట్టిన రహదారి విస్తరణ, ఫ్లైఓవర్లు, అండర్‌పాసుల నిర్మాణం అద్భుతమని అభిప్రాయపడ్డారు. దేశంలోని ఇతర ప్రముఖ నగరాలతో పోటీ పడే స్థాయికి హైదరాబాద్ ఎదిగిందని ఆయన అన్నారు.

Leave a Reply