రాష్ట్ర పోలీస్‌ క్రీడల్లో కరీంనగర్‌ పోలీసుల సత్తా..

  • 9 స్వర్ణాలు.. 4 రజతాలు.. 3 కాంస్యాలు

కరీంనగర్‌, ఆంధ్రప్రభ : ఐదో తెలంగాణ పోలీస్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌-2026లో కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ సిబ్బంది సత్తా చాటారు. టేబుల్‌ టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌ విభాగాల్లో మొత్తం 16 పతకాలు సాధించారు. ఇందులో 9 స్వర్ణాలు, 4 రజతాలు, 3 కాంస్య పతకాలు ఉన్నాయి.

మహిళల విభాగంలో ఏసీపీ మాధవి టేబుల్‌ టెన్నిస్‌ ఓపెన్‌ సింగిల్స్‌, 40 ప్లస్‌ సింగిల్స్‌, ఓపెన్‌ డబుల్స్‌లో స్వర్ణ పతకాలు సాధించారు. బ్యాడ్మింటన్‌ 50 ప్లస్‌ సింగిల్స్‌లోనూ బంగారు పతకం, 40 ప్లస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కాంస్య పతకం గెలుచుకున్నారు. డబ్ల్యూపీసీ స్వప్న టేబుల్‌ టెన్నిస్‌ 40 ప్లస్‌ డబుల్స్‌, ఓపెన్‌ డబుల్స్‌లో స్వర్ణాలు, ఓపెన్‌ సింగిల్స్‌లో రజతం, బ్యాడ్మింటన్‌ 40 ప్లస్‌ డబుల్స్‌లో స్వర్ణం సాధించారు.

ఏఎస్‌ఐ పి. ఉమారాణి టేబుల్‌ టెన్నిస్‌ 40 ప్లస్‌ డబుల్స్‌లో స్వర్ణం, 40 ప్లస్‌ సింగిల్స్‌, 50 ప్లస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రజతాలు, 50 ప్లస్‌ సింగిల్స్‌లో కాంస్యం సాధించారు. బ్యాడ్మింటన్‌లో 50 ప్లస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌, 40 ప్లస్‌ డబుల్స్‌, 50 ప్లస్‌ సింగిల్స్‌లో స్వర్ణాలు గెలుచుకున్నారు. హెచ్‌సీ సంజయ్‌ టేబుల్‌ టెన్నిస్‌ 50 ప్లస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రజతం, బ్యాడ్మింటన్‌ 40 ప్లస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కాంస్యం సాధించగా.. ఏఎస్‌ఐ సత్తయ్య బ్యాడ్మింటన్‌ 50 ప్లస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో స్వర్ణం గెలుచుకున్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని సీపీ గౌష్‌ ఆలం అభినందించారు.