Karimnagar | సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడి

Karimnagar | సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడి

  • రికార్డులు పరిశీలిస్తున్న అధికార్లు

Karimnagar | పెద్దపల్లి, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయం(Sub-Registrar’s Office)లో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించి అవినీతిని నిరోధించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు పెద్దపల్లి జిల్లా(Peddapalli District) కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.

కార్యాలయంలో రికార్డులను పూర్తిగా పరిశీలిస్తున్నారు. డాక్యుమెంట్లు ఇతర పత్రాలను పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్ల(Document Writers)ను సైతం విచారిస్తున్నారు. కాసేపట్లో పూర్తి వివరాలు తెలియజేస్తామని ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలియజేశారు.

Leave a Reply