Karimabad | కాలనీలోకి భారీ వాహనాలు..

Karimabad | కాలనీలోకి భారీ వాహనాలు..

  • కూలిపోతున్న కల్వర్టు డ్రైనేజీలు
  • పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు

Karimabad | కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ నగరంలోని కాలనీలోకి భారీ వాహనాలు ప్రవేశించడంతో కల్వర్టులు, డ్రైనేజీలు ధ్వంసం అయిపోతున్నాయి. 34 డివిజన్ శివనగర్ శ్రీ శివ భక్త మార్కండేయ దేవాలయం జంక్షన్ లోకి నిత్యం భారీ లారీలు సరుకులు తీసుకుని రావడంతో కల్వర్టు, మోరీలు ధ్వంసం అయ్యాయి దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాలనీలోకి ట్రాఫిక్ పోలీసులు భారీ వాహనాలు ఎలా అనుమతిస్తున్నారో అర్థం కావడం లేదు.

భారీ వాహనాలు కాలనీలోకి అనుమతే లేదని కాలనీ ప్రజలు అంటున్నారు. శ్రీ శివ భక్త మార్కండేయ జంక్షన్ సమీపంలో కూల్ డ్రింక్స్ గోడౌన్ ఏర్పాటు చేశారు. దీంతో ప్రతినిత్యం లారీలు రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇక్కడే పల్లవి హాస్పిటల్, ఆదిత్య చిల్డ్రన్స్ హాస్పిటల్ కూడా ఉన్నాయి. ఆసుపత్రికి వచ్చిన వారి ద్విచక్ర వాహనాలు ఆటోలు రోడ్లపై పార్కింగ్ చేస్తున్నారు.

దీనికి తోడు భారీ వాహనాలు డంపింగ్ చేయడానికి వస్తున్న క్రమంలో ట్రాఫిక్ జాం ఏర్పడి రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ట్రాఫిక్ పోలీసులు స్పందించి శివనగర్ పద్మశాలి కళ్యాణ మండపం శ్రీ మార్కండేయ దేవాలయం జంక్షన్ కాలనీలోకి భారీ వాహనాలు రాకుండా చర్యలు తీసుకోవాలని కాలనీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply