ఎక్సైజ్ సూప‌రింటిండెంట్‌కు కంది గ్రామ‌స్థుల విన‌తి

ఎక్సైజ్ సూప‌రింటిండెంట్‌కు కంది గ్రామ‌స్థుల విన‌తి

సంగ‌రెడ్డి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : కంది గ్రామంలో పాఠ‌శాల ప‌క్క‌నే క‌ల్లు దుకాణం నిర్వ‌హించం వ‌ల్ల విద్యార్థుల‌తోపాటు గ్రామ‌స్థులు కూడా ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, ఆ క‌ల్లు దుకాణం తొల‌గించాల‌ని ఆ గ్రామ‌స్థులు కోరుతున్నారు. ఈ రోజు సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ నవీన్ చంద్రకు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామంలోని శిశు మందిర్ స్కూల్ పక్కనే ఉన్న కల్లు దుకాణం రాత్రి 11–12 గంటల వరకు నడపడంతో మ‌ద్యం తాగేవారికి నిల‌యంగా మారిందని అన్నారు. అంతేగా కుండా ఆ ప్రాంతంలో మద్యం తాగే వ్యక్తులు అనుచిత ప్రవర్తనతో అంద‌రినీ ఇబ్బందుల‌కు గురిచేస్తున్నార‌ని ఆరోపించారు. ఎక్క‌డి ప‌డితే అక్క‌డ మూత్ర విసర్జన చేయడం, బస్తీ ఇండ్ల‌ ముందు క‌ల్లు తాగిన అనంత‌రం ఖాళీ పాకెట్లు వేయడం, చిన్న పిల్లలు, మహిళలపై వెకిలిచేష్ట‌లు వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు జ్వరాలు, అనారోగ్య సమస్యలు పెరిగేందుకు కార‌ణ‌మ‌వుతున్నార‌ని వారు ఆవేదన వ్యక్తం చేశారు. శిశు మందిర్ పాఠ‌శాల‌ పక్కనే ఉన్న కల్లు దుకాణం వ‌ల్ల చిన్నపిల్లల రాకపోకలకు ఇబ్బందిగా మారిందని, గణపతి చౌక్ మధ్యలో ఉన్న ఈ దుకాణాన్ని వెంటనే తొలగించాలని కోరారు.

Leave a Reply