దుర్గమ్మ అన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం

రూ.1,00,116 అందజేసిన హైదరాబాద్‌కు చెందిన సంస్థ ప్రతినిధులు

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అన్నదానం ట్రస్ట్‌కు గురువారం రూ.1,00,116 విరాళం అందింది. హైదరాబాద్‌లోని కొండాపూర్‌కు చెందిన శ్రీ గజానన్ ఈ-స్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు ఈ విరాళాన్ని ఆలయానికి సమర్పించారు.

ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ దాతల నుంచి విరాళ మొత్తాన్ని, సంబంధిత వివరాలను స్వీకరించారు. అనంతరం దాతలకు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనం పలికించారు.