ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం..

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం..
కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ఉషాజ్యోతి ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను శనివారం అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గిరి బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి, సర్ సి.వి. రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా గిరి బాబు మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే పరిశోధనాత్మక ఆలోచనలు అలవర్చుకోవాలని అన్నారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని ఆయన ఆకాంక్షించారు.విద్యార్థులు తయారు చేసిన వివిధ సైన్స్ నమూనాలను ఆయన ఆసక్తిగా తిలకించి,వారి ప్రతిభను అభినందించారు.విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో పాఠశాల సైన్స్ టీచర్ వి. అన్వేష్ , ప్రధానోపాధ్యాయురాలు రూపశ్రీ, ఉపాధ్యాయులు సౌందర్య,నిరోష, సుమలత,భార్గవి,వినిత,స్రవంతి, రవీన,నికిత,రూపాలి,హంస,వీణ విద్యార్థులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
