Kamareddy | ఆదరణ తగ్గని ఆంద్రప్రభ

Kamareddy | ఆదరణ తగ్గని ఆంద్రప్రభ
- క్యాలెండర్ డైరీ ఆవిష్కరణలో కలెక్టర్
Kamareddy | కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రభ పత్రికకు సమాజంలో ఎంతో గొప్ప ఆదరణ ఉందని, దశాబ్దాలుగా ఈ పత్రికను పాఠకులు ఎంతో ఆదరిస్తున్నారని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. ఇవాళ కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆంధ్రప్రభ నూతన క్యాలెండర్ ను, డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఆంధ్రప్రభ పత్రిక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రబావవంతంగా పని చేస్తుందని తెలిపారు. నాటి తరం నుంచి నేటి డిజిటలైజేషన్ కాలం వరకు ఆంధ్రప్రభ ఎప్పుడూ ప్రజాహితం కోసం కృషి చేస్తుందన్నారు. ఎన్నో మానవీయ కథనాలు, అభివృద్ధికి సంబంధించిన ప్రభుత్వ విధానాలను ప్రచురిస్తూ.. అభివృద్ధి కోసం ప్రజల తరుఫున కృషి చేస్తుందన్నారు.

ఈ సంవత్సరం కూడా ఆంధ్రప్రభ పత్రిక మంచి గుణాత్మక కథనాలు, ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలను వెలుగులోకి తెచ్చి మరింత మన్ననలు పొందాలన్నారు. సత్యాన్ని చెబుతూ.. సమాజాన్ని మరింత చైతన్యం చేయాలని ఆ దిశగా నేటి తరానికి విలువైన కథనాలు అందించాలని సూచించారు. అలాగే జిల్లాలో ప్రభుత్వం చేపట్టే అనేక అవగాహన, ఇతర కార్యక్రమాలపై మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎంతో శ్రమకు ఓర్చి కృషి చేస్తున్న ఆంధ్రప్రభ ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రభ సర్కులేషన్ రీజినల్ మేనేజర్ దామోదర్ రెడ్డి, డీపీఆర్వో తిరుమల, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, అదనపు కలెక్టర్ రవితేజ, కామారెడ్డి స్టాఫర్ ఇంజమూరి వెంకటేశ్వర్లు, సదాశివనగర్ మండల విలేకరి ఆశన్న, తాడువాయి మండల విలేకరి మురళి, రామారెడ్డి మండల విలేకరి బైరయ్య, తదితరులున్నారు.
