Kamareddy | వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

Kamareddy | వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

  • స్వామివారిని దర్శించుకున్న కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు

Kamareddy | జుక్కల్, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని ఖండేబల్లూర్ (బాలాజీ నగర్) గ్రామంలో గల గుట్టపై ఉత్తర ద్వారం కలిగిన గుడిలో శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువుదీరి ఉన్నారు. ఇవాళ‌ ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర ద్వారా దర్శనానికి భక్తులు బారులు తీరారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Kamareddy

ఉత్తర ద్వారం ద్వారా స్వామీజీని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల అపార నమ్మకం. ఈసందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పూజారులు ఆయనకు తీర్థ ప్రసాదాలను అందించారు. గ్రామ సర్పంచ్ చాకలి కృష్ణ, ఆలయ నిర్వహకులు, గ్రామ పెద్దలు దర్శనానికి వచ్చిన భక్తులకు ప్రసాదాలను అందించి, సకల సౌకర్యాన్ని కల్పించారు.

ఈసందర్భంగా జుక్కల్ మండలమే కాకుండా పరిసర ప్రాంత మండలాల నుండి కూడా భక్తులు వందలాదిగా తెల్లవారుజామున నుండే ఆలయానికి చేరుకుని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ ప్రాంతంలో ఉత్తర ద్వారం గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధిగాంచింది.

Leave a Reply