Kamareddy | ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖ వైద్యులు…

Kamareddy | కామారెడ్డి, ఆంధ్రప్రభ : కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ వైద్యులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. పట్టణంలోని 49వ వార్డులో జిల్లా కేంద్రానికి చెందిన గిరెడ్డి రవీందర్ రెడ్డి న్యూరో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ రెడ్డి తో పాటు ఆయన భార్య కంటి వైద్యులు అనూష ఓటు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైందని చెప్పారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
