పేదింటి ఆడబిడ్డల పెళ్లికి కల్యాణ లక్ష్మి వరం
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలకు కల్యాణ లక్ష్మి పథకం ఆర్థిక భరోసాగా నిలుస్తోందని నాయకులు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని తెలిపారు.
బెజ్జోర గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ మేస కార్తీక్ ఆధ్వర్యంలో కల్యాణ లక్ష్మి పథకానికి ఎంపికైన ముగ్గురు లబ్ధిదారులకు మంగళవారం చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడు భోజ రాకేష్, మేకల శ్రీనివాస్, ఉప సర్పంచ్ మూడేళ్ల లింబాద్రి లబ్ధిదారులకు చెక్కులను అందించారు.
కల్యాణ లక్ష్మి పథకం ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేయడంలో భాగస్వామ్యం కావడం ఎంతో సంతృప్తినిస్తుందని నాయకులు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీపీవో, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్ పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
