Kalvakuntla Kavitha: బ్యాంకు ఉద్యోగులకు మద్దతుగా కల్వకుంట్ల కవిత..
ఐదు రోజుల పని దినాల డిమాండ్‌పై కేంద్రానికి విజ్ఞప్తి
Kalvakuntla Kavitha: అధిక పనిభారంతో తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్న బ్యాంకు ఉద్యోగుల సమస్యలపై టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. బ్యాంకు ఉద్యోగులు ఎప్పటినుంచో కోరుతున్న ఐదు రోజుల పని దినాల (5-Day Work Week) విధానాన్ని వెంటనే అమలు చేయాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పనిభారంపై కవిత ఆవేదన..
ఉదయం బ్యాంకులు తెరిచిన సమయం నుండి ఖాతాదారులకు సేవలందించడంతో పాటు, డిపాజిట్లు, రుణాలు, రికవరీ టార్గెట్లు, కరెన్సీ లెక్కలు, బ్యాక్ ఎండ్ పనులతో ఉద్యోగుల రోజంతా గడిచిపోతోందని ఆమె పేర్కొన్నారు. విధి నిర్వహణలో భాగంగా చాలామంది ఉద్యోగులు రాత్రి 9, 10 గంటల వరకు కూడా కార్యాలయాల్లోనే శ్రమించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
డిజిటల్ విప్లవం ఉన్నా తగ్గని ఒత్తిడి..
గత దశాబ్ద కాలంలో దేశంలో డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ (UPI) లావాదేవీలు, ఏటీఎంల వినియోగం గణనీయంగా పెరిగాయని కవిత గుర్తుచేశారు. దీనివల్ల నేరుగా బ్యాంక్ శాఖలకు వచ్చే ఖాతాదారుల సంఖ్య తగ్గినప్పటికీ, అంతర్గత లక్ష్యాలు, పరిపాలనాపరమైన ఒత్తిళ్ల కారణంగా ఉద్యోగులపై పనిభారం మాత్రం తగ్గలేదని అభిప్రాయపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి..
విరామం లేని పనివేళల వల్ల బ్యాంకు ఉద్యోగుల ఆరోగ్యం, కుటుంబ జీవితం తీవ్రంగా దెబ్బతింటున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగుల సుదీర్ఘకాల డిమాండ్ అయిన వారానికి 5 రోజుల పని విధానాన్ని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, వెంటనే అమల్లోకి తీసుకురావాలని కల్వకుంట్ల కవిత కోరారు.
