Kalluru | అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాను..

Kalluru | అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాను..

Kalluru, ఆంధ్రప్రభ : త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు ఎన్నికలలో గ్రామ సర్పంచిగా ప్రజలు దీవిస్తే మర్లపాడు గ్రామపంచాయతీని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తానని కాంగ్రెస్ పార్టీ బలపర్చిన మర్లపాడు గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి బండి వీరబాబు అన్నారు. గత 20 సంవత్సరాలుగా గ్రామంలో స్థానికంగా నివాసం ఉంటూ రైతులు, మధ్యతరగతి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారంలో అలుపెరగని సేవలందించానని చెప్పారు. గత గ్రామపంచాయతీ పాలకవర్గంలో తన శ్రీమతి ఉప సర్పంచ్ గా ప్రజలకు సేవలు అందించారని, ప్రజాక్షేత్రంలో తన కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందన్నారు.

నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘవయ్య దయానంద ఆశీస్సులు, మంత్రి పొంగులేటి అండదండలతో గ్రామ సర్పంచిగా నూటికి నూరు శాతం విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రైతులకు సాగునీరు అందించడంలో ఏ పదవులు లేకుండానే సేవ చేసామని, ఎన్నికలలో గెలిపించి సర్పంచ్ హోదాలో విస్తృతమైన సేవలు అందించే అవకాశం ప్రజలు తనకు కల్పించాలని కోరారు. క్రికెట్ బ్యాట్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు ముద్ర వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన గ్రామ ప్రజలను కోరారు.

Leave a Reply