కల్లూరు – కాంగ్రెస్ నాయకుడి చెంప చెల్లుమనిపించిన ఎస్సైని అదేస్థాయిలో ఎస్సైపై కూడా కాంగ్రెస్ నాయకులు దాడి చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా ఎస్ ఐ పై కాంగ్రెస్ నాయకుడు దాడికి పాల్పడ్డ ఘటన శుక్రవారం రాత్రి ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో చోటుచేసుకుంది. తల్లాడ మండలానికి చెందిన కాంగ్రెస్ యువనేత రాయల రాము తన అనుచరులతో కలిసి కల్లూరు ఎన్ ఎస్ పి సెంటర్లో ఉన్న చౌదరి హోటల్ కు వెళ్లి తినటానికి అర్డర్ ఇచ్చారు.
వాళ్ళు ఇచ్చిన అర్డర్ లేదని చెప్పటంతో హోటల్ యజమాని, సిబ్బందిపై వాగ్వాదానికి దిగారు . ఇరురుపక్షాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రాము అంతటితో ఆగకుండా తన అనుచరులతో కలిసి హోటల్ పై దాడికి పాల్పడడంతో హోటల్ నిర్వాహకుడు కల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎస్ ఐ హరిత సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని గొడవను నిలువరించే ప్రయత్నం చేసింది. ఈక్రమంలో మహిళా ఎస్సై హరిత, రాముకు మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్సై పట్ల రాము దురుసుగా ప్రవర్తించడంతో ఎస్సై రాము చెంప చెల్లు మనేలా కొట్టింది. దీనితో రాము కూడా ఎస్ఐ పై దాడికి పాల్పడ్డారు. ఆమెను చెస్ట్ పై చేయి వేసి బలంగా నెట్టివేశాడు.. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. కల్లూరు పోలీసులు రాముతో పాటు తన అనుచరులు ఆరుగురుని అదుపులోకి తీసుకొని వీ.ఎం.బంజర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.