ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project). కాళేశ్వరం ఒక నీటిపారుదల పథకం మాత్రమే కాదు, ఇది తెలంగాణ రైతులపై వివక్షకు, నిరాదరణకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి నిలువెత్తు చిహ్నం. అత్యంత కీలకమైంది. అయితే ఈ ప్రాజెక్ట్ పై రెండు రాష్ట్రాల మధ్య (between two states) జల వివాదం మళ్లీ రాజుకుంది. బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project) పై ఏపీ మంత్రి నారా లోకేష్ ఇటీవలే చేసిన వ్యాఖ్యలు, దానికి తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ఇచ్చిన కౌంటర్లతో ఈ అంశం రాజకీయంగా వేడెక్కింది.
నేతల మధ్య మాటల యుద్ధం వల్ల సామాన్యులకు ఉపయోగం లేదు. ఈ ప్రాజెక్ట్ వల్ల రైతులకు లాభం చేకూరుతుందో లేదో చూడాల్పి ఉంది. ఇదిలా ఉండగా.. కాళేశ్వరం ((Kaleshwaram) వల్ల రైతులకు కనిపించని లాభాలు కూడా ఉన్నాయి. గత ఐదేండ్లలో సగటు రైతు కనీసం లక్ష రూపాయలు ఆదా చేశాడని అంచనా. ఎందుకంటే, భూగర్భ జలాలు నిలకడగా ఉండకపోతే, ప్రతి రైతు కొత్త బోరు వేయాల్సి వచ్చేది.
తెలంగాణ (Telangana)లో బోరు తవ్వడం అంటే కనీసం లక్ష రూపాయలు సమర్పించుకోవాల్సిందే. ఆ ఖర్చు తప్పించుకోవడం కూడా రైతుకి పెద్ద ఊరటే. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల పంటలే కాదు, తెలంగాణ గ్రామాల ఆర్థిక పరిస్థితి కూడా బాగా మారిపోయింది. రైతుల ఆదాయం పెరగడంతో వాళ్ల కొనుగోలు శక్తి కూడా పెరిగింది. కిరాణా, బట్టలు, ఎలక్ట్రానిక్స్, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, టీవీలు, అలాగే ఇల్లు కట్టేందుకు సిమెంట్, ఇనుము లాంటి వస్తువుల కోసం సమీప పట్టణాల్లో ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. దాంతో రిటైల్ షాపులు, రవాణా, కట్టడాల రంగాల్లో పట్టణాల్లో గిరాకీ పెరిగింది. ఇది ఉద్యోగాలు పెరగడానికి, చిన్న వ్యాపారాలు బలపడడానికి దోహదం చేస్తున్నది. కాబట్టి కాళేశ్వరం ఒక నీటిపారుదల పథకం (Irrigation scheme) మాత్రమే కాదు, ఇది తెలంగాణ రైతులపై వివక్షకు, నిరాదరణకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి నిలువెత్తు చిహ్నంగా చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ విచారణ పూర్తిచేసింది. కమిషన్‌కు నేతృత్వం వహించిన జస్టిస్ పినాకీచంద్రఘోష్ (Justice Pinaki Chandra Ghose) ప్రాజెక్టుపై తుది నివేదికను గురువారం ప్రభుత్వానికి సమర్పించారు. దాదాపు 650 పేజీలతో రూపొందించిన నివేదికను మూడు సంపుటాలుగా మార్చి సీల్డ్ కవర్‌లో బీఆర్కేభవన్‌లో ఇరిగేషన్‌శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌బొజ్జా (Rahul Bojja) కు అందజేశారు. అనంతరం ఆ నివేదికను ఆయన ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు (Ramakrishna Rao)కు అందజేశారు. ఈ సమాచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy)కి సైతం అందించారు. ఈ నివేదికను తొలుత క్యాబినెట్‌లో పెట్టి చర్చించే అవకాశముందని, తరువాత న్యాయ సలహా తీసుకొని అసెంబ్లీకి నివేదించనున్నట్టు సమాచారం. ఆ తరువాతే తదుపరి చర్యలను చేపట్టే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌లో 7వ బ్లాక్‌లోని 20, 21వ పిల్లర్లు 2023 అక్టోబర్21న కుంగుబాటుకు గురైన విషయం తెలిసిందే.