కాకినాడ జిలా ఆర్టీసీ అధికారి వెల్లడి
రాజమహేంద్రవరం, ఆంధ్రప్రభ బ్యూరో : మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని నాలుగు ఆర్టీసీ డిపోల(RTC depots నుండి 50 సర్వీసులు రద్దు చేసినట్లు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి యేలూరి సత్యనారాయణమూర్తి వెల్లడించారు. జిల్లా మొత్తంగా 219 సర్వీస్ లు నడుస్తుండగా, ఇప్పటివరకు 50 సర్వీసులు రద్దు చేసినట్లు ఆయన చెప్పారు. తుఫాను తీవ్రత అధికంగా ఉండే రూట్లలోను, అలాగే చెట్లు కూలిపోవడానికి అవకాశం ఉన్న రోడ్లలోనూ ఆర్టీసీ బస్సులను రద్దు చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఇచ్చాపురం -3, హైదరాబాద్ బీహెచ్ఈఎల్(Hyderabad BHEL) ఇంద్ర-1, విశాఖపట్నం- 9, విజయవాడ -6, భద్రాచలం-6 కాకినాడ నాన్ స్టాప్ నాలుగు, తిరుపతి-1,శ్రీశైలం -1 చొప్పున బస్సు సర్వీసులను ఇప్పటివరకు రద్దయ్యాయన్నారు. తుపాన్ సమీపిస్తున్నందున మంగళవారం రాత్రికల్లా… మరిన్ని బస్సు సర్వీసులు రద్దయ్య అవకాశం ఉందని డి పి టి ఓ మూర్తి స్పష్టం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసిందన్నారు.
అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావద్దు అని సూచించారు. ప్రభుత్వం(Government) కూడా పదేపదే హెచ్చరిస్తుండడంతో .. రెండు రోజులుగా ప్రయాణికుల రాకపోకలు కూడా చాలావరకు తగ్గాయని పేర్కొన్నారు. తుఫాన్ నేపథ్యంలో.. ప్రయాణికులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలంటూ ఆర్టీసీ కూడా మైకుల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు డి పి టి ఓ మూర్తి తెలిపారు.

