ఎన్ఎంఎంఎస్ స్కాలర్ షిప్ కు విద్యార్థుల ఎంపిక..

ఎన్ఎంఎంఎస్ స్కాలర్ షిప్ కు విద్యార్థుల ఎంపిక..
కడెం నిర్మల్ జిల్లా, ఆంధ్రప్రభ : కడం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ టెస్టుకు ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం ఎం.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పాఠశాలకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థులు మహమ్మద్ అర్హాన్, జక్కుల అశ్విత్, పి.చేతన్ సాయి లు స్కాలర్ షిప్ కు ఎంపికయ్యారని, ప్రతి నెల ఒక వెయ్యి రూపాయల ఉపకార వేతనం ను నాలుగు సంవత్సరాల పాటు విద్యార్థులు పొందుతారని ఆయన తెలిపారు. తమ పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయి ఉపకార వేతనానికి ఎంపిక కావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
