Kadem | శ్రీ లక్ష్మీ నరసన్న బ్రహ్మోత్సవాల పోస్టర్లు ఆవిష్క‌ర‌ణ‌…

Kadem | శ్రీ లక్ష్మీ నరసన్న బ్రహ్మోత్సవాల పోస్టర్లు ఆవిష్క‌ర‌ణ‌…

Kadem | కడెం (నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : కడెం మండలంలోని దిల్దార్ నగర్ గ్రామ సమీపంలో గల అరణ్య ప్రాంతంలో కొండ గుహ వెలసిన అక్క కొండ లక్ష్మీ శ్రీ నరసింహ స్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 28 నుండి ఫిబ్రవరి మూడో తేదీ వరకు నిర్వహించనున్నారు. స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను ఈ రోజు ఖానాపూర్ ఎమ్మెల్యే వెండి బొజ్జు పటేల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుఉ కొండాడి జగ్గారావు, ఆలయ కమిటీ అధ్యక్షుడు కొప్పుల లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి తుడిశెట్టి లక్ష్మీరాజం, కోశాధికారి మార్కపు లక్ష్మణ్, సారంగాపూర్ ఎలగడప గ్రామాల సర్పంచులు కోల తేజస్విని శ్రీనివాస్, నర్సింగ్, అశ్విత, రమేష్, సారంగాపూర్ ఉపసర్పంచ్ కుమ్మరి రమేష్, నాయకులు, కొమురెల్లి కృపాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply