కడప – మాజీ మంత్రి వివేకానందారెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న రంగన్న మృతి చెందారు. కొన్ని రోజులుగా రంగన్న అనారోగ్యంతో బాధపడుతున్నారు. కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు పరిస్థితి విషమించడంతో రంగన్న మృతి చెందారు. రంగన్న మృతిని వైద్యులు ధృవీకరించారు. అనంతరం ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
వివేకానందారెడ్డి ఇంట్లో రంగన్న సుదీర్ఘకాలం పని చేశారు. వివేకా హత్య సమయంలో ఆయనే ప్రధాన సాక్షిగా ఉన్నారు. వివేకా కేసులో రంగన్నను అధికారులు పలుమార్లు విచారించారు