కడెంలో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి వేడుకలు
వైఎస్సార్ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు
కడెం, ఆంధ్రప్రభ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా కడెం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు గంగన్న ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న, ఏఎంసీ చైర్మన్ భూషణ్, ఆర్టీఏ సభ్యుడు మల్లేశ్ యాదవ్ మాట్లాడుతూ వైఎస్సార్ ప్రజల సంక్షేమం కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు.
వైఎస్సార్ ఆశయాలను కొనసాగించడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అని వారు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఆయన చూపిన మార్గంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కడెం మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బాబ్లూ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు జడ రాజేశ్వర్, మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు సలీం, మండల ప్రధాన కార్యదర్శి ముసుకు రాజేందర్‌రెడ్డి, సర్పంచులు వెడమ జంగు, బొంతల లక్ష్మి, డాక్టర్ భూమన్న, ఆత్మ కమిటీ డైరెక్టర్ డి.శేఖర్, పెద్దూరు కడెం గ్రామ కమిటీ అధ్యక్షుడు వసియోద్దీన్, నాయకులు జుబేర్, దుల్లె వెంకటేశ్, చింతం రాజన్న, గంగాధర్, నారాయణ, లక్ష్మణ్, లచ్చన్నతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
