Jukkal | బీఆర్ఎస్ శ్రేణులు ధైర్యంగా ఉండండి
- జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే
- బిఆర్ఎస్ లో చేరిన బిజెపి,కాంగ్రెస్ నాయకులు
Jukkal | జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : జుక్కల్ మండలంలోని ఖండేబల్లూర్ గ్రామంలో బీఆర్ఎస్ యువ నాయకురాలు స్వప్న శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీజేపీ, కాంగ్రెస్ నుండి పలువురు నాయకులు బీఆర్ఎస్ లో చేరడం జరిగింది. ఈసందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఇరుపార్టీల నుండి బీఆర్ఎస్ లో చేరిన వారికి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే షిండే మాట్లాడుతూ… మోసపూరిత వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, పింఛన్ల పెంపు, కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ లో తులంబంగారం ఏమైందన్నారు. ప్రతి ఇంటికి 2500రూపాయలు పంపిణీ,నిరుద్యోగ భృతి రకరకాల హామీలను గాలికి వదిలేయడం జరిగిందన్నారు. పార్టీలో చేరిన వారిలో బీజేపీ నుండి నాగల్ గాం మాజీ సర్పంచ్ కపిల్ పటేల్ తోపాటు బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన పదుల సంఖ్యలో నాయకులు ఉన్నారు. ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొల్లి గంగాధర్, లాడేగాం సర్పంచ్ రాజశేఖర్ పటేల్, డోన్ గాం సర్పంచ్ శ్రీనివాస్, బీఆర్ఎస్ యువ నాయకులు వాస్రె రమేష్, బీఆర్ఎస్ నాయకులు మోయిన్, శివరాజ్ దేశాయ్, హన్మరెడ్డి, సదశివ్ పటేల్, శివాజీ పటేల్ తదితరులు ఉన్నారు.



