ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ప్రీతమ్‌కు జర్నలిస్టుల పరామర్శ

తల్లి వసంతరాణి మృతికి నివాళులు.. కుటుంబ సభ్యులకు సానుభూతి

మోత్కూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగరిగారి ప్రీతమ్‌ తల్లి వసంతరాణి ఇటీవల మృతి చెందడంతో మోత్కూర్‌కు చెందిన జర్నలిస్టులు బుధవారం హైదరాబాద్‌ చెంగిచెర్లలోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. వసంతరాణి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

వసంతరాణి మృతి పట్ల జర్నలిస్టులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రీతమ్‌తో కొద్దిసేపు మాట్లాడి కుటుంబ పరిస్థితులను తెలుసుకున్నారు.

కార్యక్రమంలో సీనియర్‌ జర్నలిస్టులు ఎస్‌.ఎన్‌.చారి, కాయితాల నర్సిరెడ్డి, జిల్లా అక్రిడిటేషన్‌ సభ్యుడు వెల్మినేటి జహంగీర్‌, గుంటి అయిలయ్య, ధబ్బేటి సోంబాబు, మాశెట్టి వెంకన్న, గుండు ప్రసాద్‌, ఆకవరం శ్రీనివాస్‌చారి, ముషం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.