జొన్నవలస పోలింగ్ బూత్ వద్ద తోపులాట
టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం.. పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
విజయనగరం, ఆంధ్రప్రభ : విజయనగరం మండలం జొన్నవలస పోలింగ్ బూత్ వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఓ మహిళ ఓటును మరొకరు వేయడంతో ఇరు పార్టీల ఏజెంట్ల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. ఈ వివాదం క్రమంగా ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాటకు దారితీసింది. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను సముదాయించడంతో పరిస్థితి సద్దుమణిగింది.
అదేవిధంగా ఇదే మండలంలోని రీమాపేట పోలింగ్ కేంద్రం వద్ద సిబ్బంది తీరును నిరసిస్తూ జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కూడా కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
