బీజేపీ, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరికలు
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని ఎందా గ్రామపంచాయతీకి చెందిన బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉట్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ సమక్షంలో వారు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్‌లో చేరిన వారిలో రాథోడ్ ఉమాజి, జాదవ్ గుణ్వంత్రావు, రాథోడ్ రాజేందర్, చౌహాన్ కళ్యాణ్, పట్టెపు లక్ష్మణ్, రాయల అర్జున్, రాయల ఎల్లన్న, రాథోడ్ గుణ్వంత్రావు, అజయ్, రాజన్న, గోయ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.
కార్యక్రమంలో ఉట్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ దాసండ్ల ప్రభాకర్, ఎందా గ్రామ సర్పంచ్ రాథోడ్ కిరణ్, గ్రామ శాఖ అధ్యక్షుడు రాథోడ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
