Job Notifications | షెడ్యూల్ రిలీజ్
- ఏపీపీఎస్సీ 21 నోటిఫికేషన్లకు పరీక్షల తేదీలు విడుదల
Job Notifications | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వరుసగా 21 ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన(related to jobs) నియామక రాత పరీక్ష(ఓఎంఆర్)ల షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ తాజాగా ఆదివారం వెబ్సైట్లో పరీక్షల గురించి సమాచారాన్ని విడుదల చేసింది. ఈ మేరకు 2025 ఏడాదిలో విడుదల చేసిన 21 నోటిఫికేషన్‌ల పరీక్షల తేదీలను ఆదివారం ఏపీపీఎస్సీ కమిషన్ వెబ్ సైట్‌లో ప్రకటించింది.. ఈ పరీక్షలను రెండు విడుతలు(Two releases)గా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మొదటి విడతగా 2026 జనవరి 27 నుంచి 31 వరకు… రెండవ విడత పరీక్షలు ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు రెండో విడత ఈ పరీక్షలు జరగనున్నాయని ఏపీపీఎస్సీ అధికారులు నోటిఫికేషన్‌లో తెలిపారు.
..అగ్రికల్చర్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ లెక్చరర్ (లైబ్రేరియన్ సైన్స్), హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ (సివిల్), హార్టికల్చర్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజినీర్(Assistant Engineer), అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ (గ్రూప్-4), అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్, వార్డెన్ పరీక్షలు జనవరి 27, 28, 30 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారని తెలిపారు. ఇక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, తానేదార్ పరీక్షలు ఫిబ్రవరి 9, 10వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 పరీక్షలు ఫిబ్రవరి 11న, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పరీక్షలు(Forest Section Officer Exams) ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఏపీపీఎస్సీ నిర్వహించనుందని పేర్కొన్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.
…జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి ఉమ్మడిగా పేపర్ 1 పరీక్ష విధానం ఉంటుందన్నారు. ఏపీపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్లలో (ఒకటి నుంచి 14 వరకు నోటిఫికేషన్లకు) ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు(Apply for the posts) చేసుకున్న అభ్యర్థులకు, జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ పేపర్ ఉమ్మడిగా ఉంటుందన్నారు. ఆ పేపర్ మార్కులను సంబంధిత నోటిఫికేషన్ల కోసం పరిగణనలోకి తీసుకుంటారు. ఇక 15, 16 నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా జీఎస్ అండ్ ఎంఏ పేపర్ ఉమ్మడిగా ఉంటుందన్నారు. సీరియల్ నంబర్ 18, 19 నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జీఎస్ & ఎంఏ పేపర్, క్వాలిఫైయింగ్ టెస్ట్ పేపర్ ఉమ్మడిగా ఉంటాయన్నారు. ఈ మేరకు ఉమ్మడి పరీక్షలను ఖరారు చేసినట్లు వెబ్సైట్లో ప్రకటనలో పేర్కొన్నారు.

