Job | దేవుడిచ్చిన వరమే ప్రభుత్వ ఉద్యోగం

Job | దేవుడిచ్చిన వరమే ప్రభుత్వ ఉద్యోగం
Job | రాప్తాడు, ఆంధ్రప్రభ : ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగంలోకి చేరినప్పుడే పదవీ విరమణ నిర్ణయించబడుతుందని జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి పి.కమ్మన్న తెలియజేశారు.శనివారం రాప్తాడు గ్రంథాలయ శాఖలో గ్రేడ్-3 గ్రంథాలయ అధికారి గా పనిచేస్తున్న వి.వీరనారాయణరెడ్డి పదవీ విరమణ ఆత్మీయ సన్మాన సభ ను నిర్వహించారు.వి.వీరనారాయణ రెడ్డి ఆయన భార్య వి.చంద్రావతి దంపతులకు ఉద్యోగ పదవీ విరమణ సంధర్భంగా ఉద్యోగులు బంధుమిత్రులు పూలమాలలు బొకేలు దుశ్శాలవాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి పి.కమ్మన్న సర్పంచ్ సాకే. తిరుపాలు జిల్లా పరిషత్ హైస్కూల్ హెడ్ మాస్టర్ టి.రాజేశ్వరి హాజరయ్యారు. ఈ సంధర్భంగా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పి.కమన్న మాట్లాడుతూ సన్మాన గ్రహీత అయిన వి. వీరనారాయణరెడ్డి 33 సంవత్సరాలు జిల్లాలోని పుట్లూరు ఎల్లనూరు తాడిపత్రి బుక్కరాయసముద్రం, రాప్తాడు శాఖా గ్రంధాలయంలో విధులు సక్రమంగా దిగ్విజయంగా నిర్వహించారు. ప్రజలకు కావలసిన సమాచారాన్ని అందిస్తూ ఉత్తమమైన సేవలు అందించారని కొనియాడారు.
సన్మాన గ్రహీత వి. వీర నారాయణరెడ్డి మాట్లాడుతూ వివిధ గ్రంథాలయాల్లో విధులు నిర్వహిస్తూ గడిపిన ప్రతి క్షణం నాకెంతో ప్రత్యేకం అన్నారు. ఇక్కడ నేర్చుకున్న విషయాలు ఎదుర్కొన్న సవాళ్లు సాధించిన విజయాలు నా కెరీర్లో మరచిపోలేనివని తెలిపారు. నా ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ముఖ్యంగా నా టీమ్ మెంబర్స్‌కు మేనేజ్మెంట్కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
అలాగే సంస్థ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పదవి విరమణ సన్మాన సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలోఉద్యోగ జేఏసీ సంఘం వై. ప్రతాపరెడ్డి రాప్తాడు గ్రంథాలయ అధికారి బి.శంకర్ ప్రసాద్, కె.జయరామ్, హెచ్. శ్రీనివాసులు, తెలుగు పండిట్ పి.లక్ష్మణ్, రవికుమార్, నాయుడు, డి. గోవిందు, సీనియర్ అసిస్టెంట్ ఆర్.ఎస్.రాజు, ఎస్. జయరాములు, వివిధ మండలాలలో పనిచేస్తున్న గ్రంథాలయ అధికారులు పాల్గొన్నారు.
