జువెలరీ చోరీ కేసులో పురోగతి..
జువెలరీ చోరీ కేసులో పురోగతి..
ధర్మపురిలో ద్విచక్ర వాహనం లభ్యం
రెండు రాష్ట్రాలకు పోలీస్ బృందాలు
బీహార్, మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తింపు
కరీంనగర్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జ్యువెలరీ షాపులో చోరీ ఘటనలో కొంత పురోగతి లభించింది. ఆదివారం రోజున కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీలో బంగారం చోరీకి పాల్పడటమే కాకుండా సిబ్బందిపై కాల్పులు గారికి గాయపరిచి పరారైన నిందితుల పల్సర్ బైక్‌ను జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని గోదావరి తీరంలో మంగళవారం పోలీసులు గుర్తించారు. బైక్‌తో పాటు సమీపంలోనే హెల్మెట్‌ను కూడా వదిలివెళ్లినట్లు సమాచారం. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కదలికలను పోలీసులు ట్రాక్ చేస్తున్నారు. గోదావరి తీర ప్రాంత గ్రామాలతో పాటు అటవీ పరిసరాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

రెండు రాష్ట్రాకు పోలీసు బృందాలు..
చోరీకి పాల్పడిన వారు బీహార్, మహారాష్ట్రలకు చెందిన వారిగా అనుమానించిన కరీంనగర్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి రెండు రాష్ట్రాలకు వెళ్లారు. నిందితుల్లో ఒకరిని తీసి ఫుటేజీల ఆధారంగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
