jewellery | గోల్డ్ ధరలకు బ్రేక్

jewellery | గోల్డ్ ధరలకు బ్రేక్
- ఈ రోజు తగ్గుముఖం పట్టిన పసిడి
- ఆనందంలో విక్రయదారులు
- పెళ్లిళ్ల సీజన్లో మరింత తగ్గాలని ఆశాభావం
ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : గత ఏడాది నుంచి బంగారం ధరలు ఆకాశాన్నంటేలా పెరిగాయి. రేట్లు జెట్ స్పీడుతో దూసుకెళ్లాయి. 2025లో 10 గ్రాముల ధర రూ.60వేలు ఉండగా, ఈ ఏడాది జనవరి నెలలో రూ.1,80,779కి చేరింది. రెండు లక్షల రూపాయలు దాటుతుందేమోనని అందరూ అనుకున్నారు. ఇకపై బంగారం కొనలేమని సామాన్యులు నిట్టూర్చారు. అయితే ప్రస్తుతం ధరలు తగ్గుతూ వస్తున్నాయి.

పసిడి ప్రియులకు ఊరటనిస్తూ ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలకు బ్రేక్ పడటంతో కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత వారం ఆల్-టైమ్ రికార్డు స్థాయిలకు చేరుకున్న ధరలు, ఇప్పుడు ఒక్కసారిగా పతనమవుతుండటంతో విక్రయదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ పసిడి ధర కొంత తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయో చూద్దాం..

ధరలు ఎలా ఉన్నాయంటే..
శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,57,750 ఉండగా.. నేడు సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,56,440కు దిగివచ్చింది. అంటే 1310 రూపాయలు తగ్గింది. అలాగే శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,600 కాగా.. నేడు సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,400 వద్ద ఉంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.1,310 తగ్గింది. అంటే 1200 రూపాయలు తగ్గింది. హైదరాబాద్లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,56,440 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,400 వద్ద ఉంది.

