విద్యార్థులతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సు బోల్తా
మానవపాడు, ఆంధ్రప్రభ: జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. మానవపాడు మండలం బోరవెల్లి వద్ద విద్యార్థులతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. వేగంగా వెళ్తున్న సమయంలో బస్సు అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 37 మంది విద్యార్థులు ఉన్నారు.
అయితే ఈ ప్రమాదంలో విద్యార్థులంతా ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. వీరంతా తమిళనాడులోని సేలం హోలీక్రాస్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
