విద్యార్థిని ఓదార్చిన జేసీ.. రూ.25 వేలు స‌హాయం

అనంతపురం, ఆంధ్రప్రభ: రాప్తాడు ఘటనలో గాయపడి అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఓదార్చారు.

అనంతపురం ఆస్పత్రిలో ఆమెను పలకరించారు. వైద్యం అందుతున్న తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. 25వేల రూపాయలు వైద్య ఖర్చులకు సహాయం అందించారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయాన్ని అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండాల‌ని భ‌రోసా క‌ల్పించారు.