January 12 Vidudala | అనిల్ రావిపూడి సినిమాపై మ్యూజిక్ డైరెక్టర్ పోస్ట్ వైరల్
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండుగకు విడుదల కానున్న సినిమాలపై ఇప్పటికే టాలీవుడ్‌లో అంచనాలు చాలా ఉన్నాయి. ప్రతి సంక్రాంతి బరిలో ఉండే అనిల్ రావిపూడి ఇప్పుడు తెరకెక్కిస్తున్న ‘జనవరి 12 విడుదల’ సినిమాపై ఓ ఆసక్తి విషయం సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు చేస్తుంది. సినిమాపై సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, కమర్షియల్ అంశాలను సమపాళ్లలో అందించడంలో అనిల్ రావిపూడికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన సినిమాలపై ప్రేక్షకుల్లో ఉండే నమ్మకం ఇప్పుడు చేస్తున్న జనవరి 12 విడుదల ప్రాజెక్ట్‌పై కూడా ఉంది. అయితే ఈ సినిమా కూడా ఫ్యామిలి ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
సినిమా విడుదలకు ముందే చిత్ర బృందానికి సినీ ప్రముఖుల నుంచి వస్తున్న స్పందనలు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. తాజాగా జి.వి. ప్రకాష్ చేసిన ప్రశంసలు ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. తాను ఈ సినిమాకు సంబంధించిన దాదాపు గంటన్నర ఫుటేజ్ చూశానని, సినిమా సంక్రాంతి సీజన్‌లో మంచి విజయాన్ని అందుకుంటుందని జి.వి. ప్రకాష్ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. ముఖ్యంగా “బ్లాక్‌బస్టర్ రాబోతోంది” అంటూ దర్శకుడు అనిల్ రావిపూడికి అభినందనలు తెలిపారు.
