అడ్మిన్లు జాగ్రత్తగా వ్యవహరించాలి

స్థానిక ఎస్సై ఉదయ్ కిరణ్..

జన్నారం, ఆంధ్రప్రభ : వాట్సాప్‌ గ్రూపుల నిర్వాహకులు అప్రమత్తంగా వ్యవహరించాలని స్థానిక ఎస్సై గుర్రం ఉదయ్‌ కిరణ్‌ సూచించారు. మంగళవారం సాయంత్రం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో పలు వాట్సాప్‌ గ్రూపుల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లోని వాట్సాప్‌ గ్రూపుల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉండే ప్రకటనలు, సందేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావివ్వకూడదన్నారు. గ్రూపుల్లో వచ్చే సందేశాలను నిర్వాహకులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అభ్యంతరకరమైన సమాచారాన్ని తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఒకే గ్రూపునకు ఒకే నిర్వాహకుడు ఉండేలా చూసుకోవాలని, పోలీస్‌ శాఖ సూచించే నిబంధనలను పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్సై తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సమావేశంలో పలు వాట్సాప్‌ గ్రూపుల నిర్వాహకులు పాల్గొన్నారు.